శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నది. ఈ సినిమా టైటిల్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు ఆవిష్కరించారు. తెలుగులో ‘మహావీరుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళంలో ‘మావీరన్’ అనే టైటిల్‌ను పెట్టారు.
‘శివకార్తికేయన్ మహావీరుడు టైటిల్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. టీమ్ అందరికి శుభాకాంక్షలు’ అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన యాక్షన్ ఎపిసోడ్ వీడియో డిఫరెంట్ మేకింగ్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న, సంగీతం: భరత్ శంకర్, నిర్మాణ సంస్థ: శాంతి టాకీస్, రచన-దర్శకత్వం: మడోన్ అశ్విన్.