Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకే కాదు, యాడ్స్‌కి కూడా ఓ బ్రాండ్ వాల్యూని తీసుకువచ్చే స్టార్ అని మరోసారి నిరూపితమైంది. పాన్ ఇండియా స్థాయి నుంచే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు పొందేందుకు రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు… యాడ్స్ పరంగానూ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. అభి బస్ అనే ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ యాప్‌కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాప్‌కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత, సంస్థ విక్రయాల్లో అమోఘమైన వృద్ధి నమోదైంది.
తాజాగా అభి బస్ CEO సుధాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహేష్ బాబు మా బ్రాండ్ అంబాసిడర్‌గా జాయిన్ అయ్యే ముందు రోజుకు సుమారు 3,000 టికెట్లు మాత్రమే అమ్మేవాళ్లం. ఆయన వచ్చాక అదే గణాంకం రోజుకు 20,000 టికెట్లు దాటి పోయింది. బ్రాండ్ విలువను అమితంగా పెంచిన వ్యక్తి మహేష్ బాబే” అని ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు అభి బస్కి చాలా సంవత్సరాల క్రితమే బ్రాండ్ అంబాసిడర్‌గా జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన కొనసాగుతున్నారు. అంటే మహేష్ మీద కంపెనీకి ఉన్న నమ్మకం దీని ద్వారా స్పష్టమవుతుంది.
ఇదిలా ఉండగా, మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా, ఈ సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా ప్రియులు మొత్తం ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా కీలక పాత్రలలో కనిపించి సందడి చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల కొన్ని పిక్స్ బయటకు రాగా, అందులో మహేష్ బాబు లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ మహేష్ కెరీర్లో బెస్ట్ మూవీ కానుందని అంటున్నారు.