సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 31 ఫస్ట్ నోటీస్ ఇస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. ఇవాళ మహేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా మహేశ్ అభిమానులకు మరో సర్ప్రైజ్ను ఇచ్చింది. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న మరో బ్లాస్టర్ ఉన్నట్లు పోస్టర్లో పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలోని మోసాలపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని మొదటి నుంచి చెబుతున్నారు. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ పోస్టర్లో మహేశ్ లుక్ అదిరిపోయింది.
SuperStar @urstrulyMahesh has Landed in Style 😎
— BA Raju's Team (@baraju_SuperHit) July 31, 2021
Here is #SVPFirstNotice 🔔
Get Ready For #SuperStarBirthdayBLASTER 💥 on AUG 9th 🔥#SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus
JANUARY 13th 2022 Release 💥 pic.twitter.com/zPdJIGRjEx
గత కొన్నేళ్లుగా మహేశ్ బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈయన గత సినిమాలు సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్ అనే నేను రూ.100 కోట్లకు అటు ఇటుగా వసూలు చేశాయి. దీంతో అభిమానులు కూడా మహేశ్ బాబు సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఇక మహేశ్ బర్త్ డే సందర్భంగా మరో బ్లాస్టర్ ఉందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో.. ఆగస్టు 9న సర్కారు వారి పాట టీజర్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు