Mahesh Babu | ప్రస్తుతం సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో మహేష్-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఒకటి. ‘SSMB 29’ చిత్రం భారీ పాన్ వరల్డ్ చిత్రంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో హైప్ తారాస్థాయిలో ఉంది.ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తాజా షెడ్యూల్లో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ జాయిన్ అయినట్లు టాక్. ఆయన సినిమాలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం నిర్మాతలు ముందుగా నానా పాటేకర్, విక్రమ్ వంటి స్టార్స్‌ను కూడా సంప్రదించినట్లు సమాచారం.
ఒడిశా, హైదరాబాద్‌లలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన టీమ్ కొంతకాలం విరామం తీసుకుంది. ప్రస్తుతం రాజమౌళి నేతృత్వంలో తాజా షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమైంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్లను అక్కడ అంబోసెలీ నేషనల్ పార్క్ సహా ఇతర అటవీ ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలంటే కథపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈసారి కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మూవీ కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ప్రపంచ యాత్రగా ఉండబోతుందట. దీనికి రామాయణంలో ‘సంజీవని’ ఇతివృత్తం ఆధారమని వినిపిస్తోంది.
అలాగే, మహేష్ బాబును పూర్తిగా కొత్త లుక్‌లో చూపించనున్నారట. భారీ యాక్షన్ సీన్స్, డైనోసార్ వేటలు వంటి వినూత్నమైన సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ కానున్నాయని బీటౌన్ టాక్. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి ప్రీ-ప్రొడక్షన్ పనులు, లొకేషన్లు, కథా విషయాలు అన్నీ గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మూవీకి దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో రాజమౌళి చిత్రీకరణ కొనసాగిస్తున్నారట.