Mahesh Babu|సితార.. మహేష్ బాబు ఎప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. వారిద్దరిని చూసిన ప్రతిసారి అభిమానులు మురిసిపోతూ ఉంటారు. మహేష్ బాబుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. ఆయన కూతురు సితారకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ ఫ్యాన్స్ అంతా సితారను కూడా ఎంతో బాగా ఇష్టపడుతూ ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఏ పోస్ట్ కి అయిన స్పందిస్తూ ఉంటారు. సితార హైట్, పర్సనాలిటీ చూసినవారికి ఆమె ఏం చదువుతుంది అనే అనుమానం కలుగుతుంది. ఇటీవల సితార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ నువ్వు ఏం చదువుతున్నావ్ అన్న ప్రశ్న ఎదురు కాగా, తాను ఆరో తరగతి చదువుతున్నానని.. ఇప్పుడు ఏడో తరగతిలోకి వెళ్తానని బదులిచ్చింది.
సితార వయసు ప్రస్తుతం 12 ఏళ్లు కాగా, ఇంత చిన్న వయస్సులోనే చాలా పాపులారిటీని సంపాదించుకుంది. మహేష్ బాబు ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా సితార తన తండ్రితోనే సమయం గడుపుతూ ఉంటుంది.. తాజాగా తన తండ్రి మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ చేసింది సితార. ఈ యాడ్‌ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగాచ, ఇందులో సితార-మహేష్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.ఈ యాడ్‌లో రోజ్ కలర్ ఫుల్ షర్ట్‌లో మహేష్ బాబు అదిరిపోయారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేష్ రాగానే అవును నాన్న అంటూ మహేష్ బాబుపై డ్రెస్ విసిరేస్తుంది సితార.
ఇక వెంటనే మహేష్ కాస్ట్యూమ్ మారిపోతుంది. అలా మహేష్ కూడా సితారపై బట్టలు విసురుతాడు. అలా ఒకరపై ఒకరు బట్టలు విసురుకుంటూ కొత్త కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ప్రస్తుతం ఈ యాడ్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ యాడ్‌లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు. ఇక సితార అయితే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంతో క్యూట్‌గా కనిపించింది.ఇక ఈ యాడ్‌లో సితార గొంతు అచ్చం శ్రీలీల గొంతు మాదిరిగానే అనిపిస్తుంది. కొంపదీసి సితారకి శ్రీలీల డబ్బింగ్ చెప్పలేదుగా అని కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం #SSMB29గా రూపొందుతోంది. ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా గత 15 రోజులుగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చిత్రీకరణ జరుపుకుంది. రీసెంట్గా ఒడిశా షెడ్యూల్ పూర్తికావడంతో అందరు ఆ ప్రాంతాన్ని వీడారు.