GunturKaaram Movie | సంక్రాంతి అని కాన్ఫిడెంట్‌గా పోస్టర్లు గట్రా రిలీజ్ చేస్తున్నారు కానీ.. చెప్పిన టైమ్‌కు గుంటూరు కారం వస్తుందా అన్నది ఫ్యాన్స్‌లో ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. వాళ్ల టెన్షన్‌కు కారణం లేకపోలేదు. ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షో మాదిరిలా.. ప్రతీ వారం ఎవరో ఒకరు సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు.. మరోవైపు మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్ ఇలా అసలు షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందన్న క్లారిటీ కూడా లేదు. దానికి తోడు గంపగుత్తగా ఒకటి తర్వాత మరోక సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించడం మహేష్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక ట్విట్టర్ హ్యాండిల్లో గుంటూరు కారం పోస్ట్ పోన్ అని పలువరు అప్పుడే ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే సంక్రాంతి రేసు నుంచి మహేష్ తప్పుకుంటున్నాడా అనే అనుమానాలు రావడం సహజమే.
కాగా తాజాగా ఈ రూమర్స్ అన్నిటికి సూపర్ స్టార్ చెక్ పెట్టాడు. ఖచ్చితంగా సంక్రాంతికే సినిమా వస్తుందని తెలిపాడు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ఇంకా 80రోజులు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎనభై రోజులు బ్రేకుల్లేకుండా నిర్విరామంగా షూటింగ్‌ను కొనసాగిస్తారని ఇన్సైడ్ టాక్. ఆ పై పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్ల గట్రా ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్లకు సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. నిజానికి మహేష్ బర్త్‌డే రోజునే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేశారు.
ఈ సినిమాలో మహేష్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే రేంజ్లో ఎలివేషన్లు ఉంటాయి. పేరుకు ఫ్యామిలీ కథనే తీసుకున్నా.. అభిమానులను సాటిస్ ఫై చేసే స్టఫ్ పుష్కలంగా ఉందని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా మహేష్‌ను ఈ సినిమాలో సరికొత్త అవతారంలో మాస్ హీరోగా చూడబోతున్నామట. శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.