Devaki Nandana Vasudeva | మహేశ్ బాబు మేనల్లుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva). జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అశోక్ గల్లా మామ సూపర్ స్టార్ మహేశ్ బాబు కామియో రోల్లో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వవలసి ఉంది.
ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తుంది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. ఇక కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల చివరగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్ జంధ్యాల.
#DevakiNandanaVasudeva – Superstar #MaheshBabu doing a short cameo in the film? pic.twitter.com/tVdTXMSiEt
— Aakashavaani (@TheAakashavaani) October 28, 2024