Mahesh babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (MaheshBabu) ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. సినిమాలకు కూడా అంత ప్రాధాన్యత ఇస్తాడు. స్టార్ యాక్టర్‌గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేశ్ బాబు పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నాడు. కుమారుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam ghattamaneni ) గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నందుకు గౌతమ్ ఘట్టమనేనికి శుభాకాంక్షలు. రాబోయే చాప్టర్ రాసుకునేది నీదే. నువ్వు గతంలో కంటే మరింత ప్రకాశవంతంగా ఉండబోతున్నావని నాకు తెలుసు. నీ కలలను చేధిస్తూ వెళ్లు. నువ్వు ఎప్పుడూ ప్రేమింపబడతావని గుర్తుంచుకో.. అంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Family picture ❤️@urstrulyMahesh pic.twitter.com/B3fIcel4Ha
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) May 26, 2024