Mahesh Babu | లార్డ్స్ లో ప్రియుడితో మెరిసిన మహేష్ బ్యూటీ.. వీరి ప్రేమాయణంపై క్లారిటీ వచ్చినట్టేనా?
Mahesh Babu | మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా ఫెయిలైనప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఆమె నటించిన ‘హీరో పంతీ’ హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో అక్కడ సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి.
Mahesh Babu | మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా ఫెయిలైనప్పటికీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఆమె నటించిన ‘హీరో పంతీ’ హిందీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో అక్కడ సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. తెలుగులో నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రం చేయగా, ఈ మూవీ నిరాశనే మిగిలిచ్చింది. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌కి చాలా రోజుల పాటు దూరంగా ఉంది. ఇక ఆ మధ్య ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో కృతి టాలీవుడ్‌కు దూరంగా ఉండిపోయింది.
అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ తెగ హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణం ఇటీవల కాలంలో వ్యాపారవేత్త కబీర్ బహియాతో ఆమె ప్రేమలో ఉన్నట్టు గాసిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి ఫోటోలు, వీడియోలు అనేకసార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ జంట లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ వీక్షిస్తూ కెమెరాలకు చిక్కారు. కబీర్ స్వయంగా కృతితో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో ఈ రిలేషన్ అఫీషియల్ అయినట్టేనని ముచ్చటించుకుంటున్నారు. కబీర్‌కు లండన్‌లో వ్యాపారాలు ఉండటంతో ఎక్కువగా అక్కడే ఉంటాడట. కృతి సైతం షూటింగ్‌లు లేనప్పుడు ఎక్కువ సమయం అతనితోనే గడుపుతున్నట్టు తెలుస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఓ స్నేహితుడి పెళ్లిలో వీరిద్దరూ కలుసుకున్నారట. ఆ పరిచయం ప్రేమగా మారినట్టు చెబుతున్నారు. ఒకరి అభిప్రాయాలు, ఆసక్తులు కలవడంతో రిలేషన్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. పెళ్లి విషయంపై స్పష్టత లేదు కాని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో పెళ్లి జరుగవచ్చని బాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కృతి సనన్ పెళ్లి తర్వాత కూడా సినిమాలను యధావిధిగా చేస్తూ నటనా ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

