Mahavatar Narsimha | కన్నడ టాప్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రెండు రోజులు అసలు బజ్ లేకుండా నడిచింది. అయితే ఆ తర్వాత ఈ చిత్రం విపరీతంగా పుంజుకుంది. ముఖ్యంగా కన్నడతో పాటు తెలుగులో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60 కోట్లు వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో ఇండియాన్ యానిమేటేడ్ చిత్రాలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించడు.