Mahavatar Narsimha | హిందూ పురాణాల నేపథ్యంలో యానిమేటెడ్ చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. కన్నడలో అగ్ర నిర్మాణ సంస్థలు అయిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను నుంచి తాజాగా ఓటీటీ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12:30 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఇది మొదటి భాగం. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.
Don’t miss this one 💫#Netflix #MahavatarNarasimha pic.twitter.com/omAZ1rUTVu
— Vishal (@VishalR1729) September 18, 2025