Mahavatar Narsimha | హిందూ పురాణాల నేపథ్యంలో యానిమేటెడ్ చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. కన్నడలో అగ్ర నిర్మాణ సంస్థలు అయిన హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే నేటికి ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ డిలీటెడ్ సీన్ విడుదల చేశారు.
హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఇది మొదటి భాగం. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ భారీ విజయం యానిమేటెడ్ చిత్రాలకు భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉందని నిరూపించింది.