Mahavatar Narasimha | భారీ హీరోలు లేరు… పెద్దగా మార్కెటింగ్ లేదు… ప్రమోషన్స్ హడావుడి ఏదీ లేదు. అయినా బాక్సాఫీస్‌ను శాసించి, ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించి, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది ‘మహావతార్ నరసింహ’. ఇప్పుడు అదే చిత్రం ఆస్కార్ రేసులో అడుగుపెట్టడంతో మరోసారి అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షిస్తోంది.హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుండే మౌత్ టాక్‌తో దూసుకుపోయింది. ఆధునిక యానిమేషన్‌తో నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్భాగవతంలోని అంశాలను అద్భుతంగా చిత్రీకరించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రియలిస్టిక్ గ్రాఫిక్స్, పౌరాణిక వైభవం, నరసింహ అవతారం యొక్క శక్తి ప్రతీ సన్నివేశంలో ప్రతిఫలించడంతో థియేటర్లలోనే భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది.
తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ వచ్చాక కూడా రికార్డు స్థాయి వ్యూస్‌తో ఓటీటీలో కూడా సత్తా చాటుకుంది. తరువాత విదేశాల్లో విడుదల చేసినా అదే స్పందన లభించింది. 98వ ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల్లో ‘మహావతార్ నరసింహ’ ఒకటిగా ఎంపిక కావడం విశేషం. జనవరి 22న ఫైనల్ నామినేషన్లు ప్రకటించనుండగా, ఈ చిత్రం ఎంపికైతే ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ యానిమేషన్ ఫిల్మ్‌గా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు నీరజ్ ఘయ్వాన్ తెరకెక్కించిన ‘హోంబౌండ్’ ఇండియా అధికారిక ఎంట్రీగా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడుతోంది. రెండు వేరే కేటగిరీల్లో భారత సినిమాలు ప్రపంచ పటంపై నిలవడం సినీ ప్రేక్షకులకు గర్వకారణంగా మారింది.
అయితే తాజాగా మహావతార్ నరసింహా చిత్రాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో ప్రదర్శించగా వందలాది పాకిస్థాని హిందువులు హాజరయ్యారు. నరసింహ అవతారం కథను పెద్ద తెరపై చూడడం వారికి భావోద్వేగ క్షణాలను మిగిల్చింది. పాకిస్థాన్‌లో కూడా హిందూ సంస్కృతి పట్ల ఉన్న అభిమానం, భక్తి ఈ సందర్భం ద్వారా స్పష్టమైంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపు స్వస్థలం నేటి పాకిస్థాన్‌లోని ముల్తాన్ అని చెబుతారు. నరసింహ అవతారం చోటుచేసుకున్నది, హిరణ్యకశ్యపుడి సంహారం జరిగినది అక్కడేనని కొన్ని ఆధారాలను అక్కడి పండితులు చూపించడం గమనార్హం. అహోబిలం కాదు… ఇదే ఆ ప్రామాణిక స్థలమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు.