Vijay Sethupathi | కథను నమ్మి సినిమాలు చేసే స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). కూల్ అండ్ సింఫుల్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేస్తుంటాడు మక్కళ్ సెల్వన్. ఈ స్టార్ నటుడి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మహారాజ (Maharaja). భారీ అంచనాల నడుమ జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సెలూన్ షాపు నిర్వహించే మహారాజ (విజయ్ సేతుపతి) తన కూతురు జ్యోతితో కలిసి నివసిస్తుంటాడు. ముగ్గురు దొంగలు తనపై దాడి చేసిన తన లక్ష్మిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు ఇంతకీ లక్ష్మి ఎవరో డైలమాలో పడి కేసు నమోదు చేసేందుకు నో చెప్తారు. కానీ పోలీసులు అదేంటనే అన్వేషణ మాత్రం కొనసాగిస్తుంటారు. ఇంతకీ లక్ష్మి ఎవరు..? మహారాజ అంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటాడు..? ఇంతకీ వాళ్లు లక్ష్మి ఎవరో కనిపెడతారా..? లక్ష్మిని మళ్లీ తెచ్చుకోవడమే మహారాజ లక్ష్యమా..? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.
ఈ సినిమాకు ‘ఒంబత్తనే దిక్కు’, ‘కురంగు బొమ్మైస’ చిత్రాల ఫేమ్ నితిలన్ స్వామినాథన్ (Nithilan Swaminathan) దర్శకత్వం వహించగా.. ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్, అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరిసారు.
ఇవి కూడా చదవండి..