రజత్ రాఘవ్, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ‘మహర్యోధ్ 1818’ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజు గుడిగుంట్ల దర్శకత్వం వహిస్తున్నారు సువర్ణ రాజు దాసరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి విక్టర్ ప్రసాద్ క్లాప్‌నివ్వగా, దామోదరప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు.
‘సోషల్ థ్రిల్లర్, యాక్షన్ ఫాంటసీ చిత్రమిది. వైవిధ్యమైన కథ, కథనాలతో సాగుతుంది. ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: మహా-శశాంక్, నిర్మాణ సంస్థ: డీఎస్ఆర్ ఫిల్మ్స్, దర్శకత్వం: రాజు గుడిగుంట్ల.