హరీష్ వినయ్, ప్రియాంక దే జంటగా నటిస్తున్న సినిమా ‘మహా లింగాపురం’. సాయిదత్త క్రియేషన్స్ పతాకంపై ప్రవీణ్‌రెడ్డి కాడికారి నిర్మిస్తున్నారు. శ్యామ్ మండల దర్శకుడు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ..‘సస్పెన్స్, యాక్షన్ లాంటి అన్ని వాణిజ్య అంశాలను కలిపి సినిమాను రూపొందించాం. చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, అంబటి శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శివారెడ్డి శవనం, ఎడిటర్ : జేపీ, సంగీతం : సందీప్ కంగుల.