Madhuri Rathod | ఫోక్ సాంగ్స్, డ్యాన్స్‌లతో మంచి పాపులారిటీ సంపాదించికున్న నటి, గాయని మాధురి రాథోడ్ తన తోటి ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయితో నడుస్తున్న వివాదంలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఈశ్వర్ సాయి తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా నిందితుడైన ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకపోవడం పట్ల ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని ఈ కేసు నుండి తప్పించడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు పోలీసుల నుంచి కూడా సరైన న్యాయం అందడం లేదన్న తీవ్ర ఆవేదన ఆమెను కుంగదీసింది.
కాగా మాధురి రాథోడ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయిపై పెట్టిన కేసులో మరోసారి స్టేట్మెంట్ ఇచ్చింది. 16 రోజులు అయినా ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్టు చేయట్లేదు అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామంటూ చెప్పిన నార్సింగి పోలీసులు.. ఈశ్వర్ సాయి, భార్య శరణ్య, సంధ్య రాణిపై మరో కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.
Vijay Sethupathi | విజయ్ సేతుపతి, సాయిపల్లవి లుక్ అదిరింది.. టైటిల్ ఏంటో తెలుసా..?
Bipasha Basu | బిపాసా బసు రీ ఎంట్రీకి రెడీ.. 8 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమాపై భారీ అంచనాలు