యువజంట ఉదయ్‌రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన టీనేజ్ లవ్‌స్టోరీ ‘మధురం’. ‘ఎ మెమొరబుల్ లవ్’ అనేది ఉపశీర్షిక. రాజేష్ చికిలే దర్శకుడు. ఎం.బంగార్రాజు నిర్మాత. పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. 1990 కాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇదని, అప్పటి స్కూళ్ల వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఈ సినిమాను రూపొందించామని, సాంకేతికంగా సినిమా అభినందనీయంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ‘బస్‌స్టాప్’ఫేం కోటేశ్వరరావు, కిట్టయ్య, ఎస్.ఎం.బాబాయ్, దివ్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి, సంగీతం: వెంకీ వీణ, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర ఎంటైర్టెన్మెంట్స్.