‘ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శ్రీచరణ్, గీత్ నటన ఆర్గానిక్‌గా ఉంది. కచ్చితంగా మంచి సినిమా అవుతుందనిపించింది.’ అని హీరో సిద్దు జొన్నలగడ్డ అన్నారు. మధుశాలిని సమర్పకురాలిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కన్యాకుమారి’. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేసిన సిద్దు జొన్నలగడ్డ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. సినిమా చాలా బాగా వచ్చిందని, బన్నీవాస్ సపోర్ట్‌తో సినిమాను విడుదల చేస్తున్నామని మధు శాలిని చెప్పారు. ఇందులోని పాత్రలన్నీ రియల్లైఫ్లోంచి తీసుకున్నవేనని, ప్రేక్షకులకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని దర్శక,నిర్మాత సృజన్ పేర్కొన్నారు. ఇంకా చిత్రబృందంతోపాటు శశికుమార్ తిక్క కూడా మాట్లాడారు.