MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం సీక్వెల్స్‌తో హిట్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టిన నాగవంశీ.. మరో క్రేజీ సినిమాకు సీక్వెల్ తీసుకోస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న తాజా చిత్రం మ్యాడ్ స్క్వేర్. సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.
ఫస్ట్ పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత నటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లడ్డుగాని పెళ్లి అనే పాట విడుదలై చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ను రేపు ప్రకటించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. క త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఈ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
The MAD gang is coming to rock your playlists once again with “𝑻𝒉𝒆 𝑴𝒂𝒅𝒅𝒆𝒔𝒕 𝑺𝒐𝒏𝒈 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒀𝒆𝒂𝒓”😎🕺#MADSquare 2nd Single Out Tomorrow at 04:05 PM! 🥳#ThisTimeItsMADMAXX 💥 pic.twitter.com/Hb0p67MYaq
— BA Raju’s Team (@baraju_SuperHit) December 27, 2024