గురువారం రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ‘మ్యాడ్’ పేరుతో తెరకెక్కించబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాం. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది.
సినిమా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సామ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: ఎస్.నాగవంశీ, రచన-దర్శకత్వం: కల్యాణ్ శంకర్.