Manchi Rojulochaie | మంచి రోజులు వచ్చాయి సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..

Manchi Rojulochaie | కరోనా తర్వాత విడుదలవుతున్న ఏ సినిమాలకు కూడా స్పెషల్ ప్రీమియర్స్ వేయడం లేదు దర్శక నిర్మాతలు. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితుల కారణంగా ప్రీమియర్ వేయడానికి అనుమతులు కూడా పెద్దగా రావడం లేదు. ఇలాంటి సమయంలో మొన్న పూరీ జగన్నాథ్ రొమాంటిక్ సినిమా రెండు రోజుల ముందు తనకు కావాల్సిన వాళ్ల కోసం ప్రీమియర్ వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మారుతి తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయి సినిమాకు భారీగా ప్రీమియర్స్ పడుతున్నాయి. సంతోశ్ శోభన్ హీరోగా యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి.

దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి.
మిగిలిన చోట్ల కూడా పెయిడ్ ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రెస్పాన్స్ చాలా బాగా ఉండటంతో సినిమాకు మరింత కలిసి రానుంది.
సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. దానికి తోడు మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు బుకింగ్స్ కు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. దాంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి విడుదలవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ-2019 విన్నర్, రన్నర్ దుర్మరణం
Samantha : సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Puneet Raj Kumar : పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Pawan Kalyan : పవర్ స్టార్ అంటే మండి పడుతున్న పవన్ కళ్యాణ్
వరుడు కావలెను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. టాక్ బాగున్నా వసూళ్లు బాగోలేవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

