Maaveeran | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మావీరన్. తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో విడుదలైంది. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచి మావీరన్కు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తోంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం మావీరన్ ఇప్పటివరకు రూ.75 కోట్లు వసూళ్లు చేసింది. రానున్న రోజుల్లో రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం తథ్యమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా నటించగా.. సునీల్ కీలక పాత్ర పోషించాడు.శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మించగా.. భరత్ శంకర్ సంగీతం అందించాడు. శివకార్తికేయన్ మరోవైపు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. SK21గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లొకేషన్లో సాయిపల్లవికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
Our #Maaveeran/#Mahaveerudu has grossed over 75 CRORES worldwide. Thanks to the wonderful fans and audience for making it a BLOCKBUSTER 🥳🙏#BlockbusterMaveeran #BlockbusterMahaveerudu
🌟 @Siva_Kartikeyan
🎙️ @VijaySethuOffl / @RaviTeja_offl
🎬 @madonneashwin #VeerameJeyam… pic.twitter.com/SkPfB2uciN— Shanthi Talkies (@ShanthiTalkies) July 25, 2023
మహావీరుడు ట్రైలర్..
మావీరన్ టైటిల్ అనౌన్స్మెంట్..