Maama Mascheendra | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాన్, ఊబకాయం ఉన్న వ్యక్తిలా, డీజేలా.. మూడు పాత్రలకు సంబంధించి లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన గాలుల్లోనా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సుధీర్ బాబు ఇందులో బొద్దుగా, యంగ్ స్టైలిష్‌గా, ఏజ్ బార్ గెటప్‌లో.. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలతో వినోదాన్ని అందించబోతున్నట్టు అర్థమవుతోంది.
The date is set & we can’t wait 🤟🏻
The Triple Dhamaka #MaamaMascheendra is set to entertain everyone 💥
WW Grand Release in theatres on OCTOBER 6th, 2023 🔥@isudheerbabu @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic #SVCLLP pic.twitter.com/bW4RCkWsHt
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) September 6, 2023
‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టినట్టు? 🤔
Nitro Star @isudheerbabu & @HARSHAzoomout announces #MaamaMascheendra TEASER Release Date in Style – APRIL 14th💥
– https://t.co/wPE1AAsUDl@YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids @adityamusic pic.twitter.com/YWyNMmzpKC
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 10, 2023
మామా మశ్చీంద్ర టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో..