Actress Maadhavi Latha | తెలుగు హీరోలపై ఇక్కడి ప్రేక్షకులు చూపించే అభిమానం లెక్కకట్టలేనిది. అభిమాన హీరోను ఎవరైనా ఏదైనా అంటే చాలు వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. అయితే ఒక్కోసారి హీరోలపై చూపించే అసాధారణ అభిమానం పక్కవాళ్లకు చిరాకులు కూడా తెప్పిస్తుంది. ప్రస్తుతం అలాంటి ఘటనే టాలీవుడ్లో చోటు చేసుకుంది. ఇప్పటికిప్పుడు టాలీవుడ్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరా అని అడిగితే తడుముకోకుండా అందరూ చెప్పే సమాధానం పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే ఆ రోజు పండగే వాతావరణమే.
కాగా శనివారం పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు విషెస్‌లు తెలిపారు. కాగా నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసిన మాధవి లత కూడా పవర్ స్టార్‌కు విషెస్ పెట్టింది. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌లో మిస్టర్ పవన్ కళ్యాణ్ అని సంభోదించి విషెస్ చెప్పింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు మిస్టర్ అని ఎలా సంభోదిస్తారంటూ అసభ్యపదజాలాన్ని ఉపయోగించారు.
వీటితో విసుగెత్తిపోయిన మాధవి లత కూడా అదే రేంజ్లో తిరిగి కౌంటర్ ఇచ్చింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినా కూడా ఇంత రచ్చ చేస్తారా? మీరు తమ్ముడు గారు, బాయ్ ఫ్రెండ్ గారు, మొగుడు గారు అంటారేమో.. నేను కాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే.. మీరే పవన్‌ను నాశనం చేస్తున్నట్లు అని ఫ్యాన్స్‌పై మండిపడింది.