శ్రీరామ్, స్వాతి జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకుడు. అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సీనియర్ నటుడు బాబూమోహన్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అందరూ మెచ్చుకునే సినిమా అవుతుందని దర్శకుడు మైకిల్ నమ్మకంగా చెప్పారు. పనిచేసినవారందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని, దర్శకుడు మైకిల్ ప్రాణం పెట్టి తీశారని నిర్మాత తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు శ్రీరామ్, స్వాతి, గద్దర్ నరసన్న, సమ్మెట గాంధీ, నాగమహేశ్, గౌతంరాజు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వినోద్, సంగీతం: మనిష్కుమార్.