Maa Nanna Super Hero | హరోం హర సినిమాతో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్నాడు నటుడు సుధీర్‌బాబు(Sudheer Babu). ఆయన కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’(Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా.. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిచంద్, సాయాజీ షిండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ టీజర్ చూస్తుంటే.. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. సమ్మోహనం వంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ సుధీర్ బాబు ఇలాంటి క్లాస్ స్టోరీతో వస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి వి. సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.