అగ్ర కథానాయిక సమంత నటనతో పాటు సినీ నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నది. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ ఏడాది ఆమె నిర్మించిన ‘శుభం’ చిత్రం వినూత్న కథాంశంగా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఇదే బ్యానర్లో తాను ప్రధాన పాత్రలో నటిస్తూ ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి శ్రీకారం చుట్టింది సమంత. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. ‘ఓ బేబి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రమిది కావడం విశేషం.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌లో సమంత యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా ఇదని, సమంత పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాష్, సంగీతం: సంతోష్ నారాయణన్, కథ, స్క్రీన్‌ప్లే: సీతా మీనన్, వసంత్ మరిన్‌గంటి, నిర్మాతలు: సమంత, రాజ్ నిడుమోరు, దర్శకత్వం: నందినీ రెడ్డి.