మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive for murder). ఈ సినిమా హిందీ ట్రైలర్‌ని ప్రతిష్టాత్మక గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ఐఎఫ్ఎఫ్ఐ కళా అకాడమీ వేదికపై ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అతుల్ చిత్ర యూనిట్‌ను అభినందించి, శుభాకాంక్షలు అందించారు.
‘M4M’ మూవీ ట్రైలర్ గోవాలో లాంచ్ చెయ్యడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఈ సినిమాలో హీరోయిన్గా చేయడం గర్వంగా ఉందని కథానాయిక జోశర్మ ఆనందం వ్యక్తం చేశారు. అనూహ్యమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘M4M’ అని, త్వరలో తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నామని మోహన్ వడ్లపట్ల తెలిపారు.