M.S.Dhoni Wife Sakshi | క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా పుష్ప సినిమాతో బన్నీ ఎక్కడికో వెళ్లిపోయాడు. ముందునుంచే బన్నీకి నార్త్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి సెలబ్రెటీలు సైతం బన్నీతో చనువుగా ఉన్న ఎన్నో ఫోటోలు బయటకు కూడా వచ్చాయి. అయితే మార్కెట్ పరంగా బన్నీపై పుష్పకు ముందు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎంత సూపర్ హిట్టయినా మహా అయితే పాతిక, ముప్పై కోట్లు వస్తాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ పుష్ప కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అసలెలాంటి ప్రమోషన్లు లేకుండా వంద కోట్ల బొమ్మ కొట్టిందంటే మాములు విషయం కాదు. ఈ సినిమా తర్వాత హిందీ నాట అల్లు అర్జున్ సెన్సేషన్ అయ్యాడు. సినీ ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ బన్నీ ఫ్యాన్స్ అయ్యారు.
తాజాగా ఎం.ఎస్ ధోని భార్య సాక్షీ సైతం బన్నీకి వీరాభిమానంటూ చెప్పడం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను అనందపు విహారంలో తిరిగేలా చేసింది. తమిళ సినిమా లెట్స్ గెట్స్ మ్యారేజ్(LGM) అనే సినిమాతో ధోని నిర్మాతగా మారాడు. హరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో లవ్‌టుడే భామ ఇవాన హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ రిలీజ్ కాగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లను ధోని భార్య సాక్షి చూసుకుంటుంది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రెస్మీట్లు నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.
కాగా రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని, ఆయనకు వీరాభిమానని చెప్పింది. ఇప్పటిదాకా ఆయన నటించిన ఏ మూవీని వదలకుండా చూశానని, ఓటిటిలు.. గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానల్స్‌లో అన్నీ కవర్ చేశానని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌తో అల్లు అర్జున్ అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. ధోని భార్య సైతం మా హీరో అభిమానే అంటూ ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.