Megastar Chiranjeevi | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వంభర సెట్స్ నుంచి స్పెషల్ వీడియో విడుదల చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్గా డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టింది. అయితే నేడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా చిరు ఒక స్పెషల్ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోతో తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ తెలిపాడు.
గతంలో సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే సంగీత దర్శకుడి ఆధ్వర్యంలో మూవీ టీమ్ అంతా కుర్చోని చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. అయితే విశ్వంభర సినిమాతో మళ్లీ ఆరోజులు గుర్తోచ్చాయి. మా ఇంట్లో సంగీత దర్శకుడు కీరవాణి తన టీమ్‌తో కలిసి విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. ఆపద్భాంధవుడు సినిమా సమయంలో కూడా ఇలానే మేము సిట్టింగ్ వేసి చర్చించుకునే వాళ్లం.. ఇదంతా కీరవాణి వలనే అయ్యింది. ఈ రోజే జన్మించిన మా ‘ఆస్కారుడు’ ఎం.ఎం. కీరవాణికి నా హృదయపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ రోజే జన్మించిన మా ‘ఆస్కారుడు’ ఎం.ఎం. కీరవాణి గారికి నా హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు ! 💐💐
Happy Birthday @mmkeeravaani garu!! pic.twitter.com/gpLjstmTdv
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 4, 2024
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్(Kunal Kapoor) నటించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదల కానుంది.