నోయల్‌సేన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ చిత్రం ‘చకోరి’. సత్య ధానేకుల దర్శకత్వంలో దేవు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా ‘నా చెలివే’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా, నోయల్సేన్తో పాటు మోహబూబ్ ఈ పాటలో కనిపిస్తారు. లీండర్ లీమార్టీ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. చిత్రన్ ఈ పాటకు సాహిత్యం అందించారు.