తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘LYF – Love Your Father’. ఎస్పీ చరణ్, శ్రీహర్ష, కషిక కపూర్ ప్రధాన పాత్రధారులు. పవన్ కేతరాజు దర్శకుడు. రామస్వామిరెడ్డి, కిశోర్ రాఠీ, మహేశ్ రాఠీ, ఎ.సామ్రాజ్యం, ఎ.చేతన్ సాయిరెడ్డి నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. సక్సెస్ సెలబ్రేషన్స్‌ని హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో భాగమైనందుకు ప్రధాన తారాగణం ఆనందం వ్యక్తం చేశారు. ఇందులోని ఎమోషన్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యాయని, ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారని దర్శకుడు చెప్పారు. తమ మనీషా సంస్థ గౌరవాన్ని మరింత పెంచిన సినిమా ఇదని, సినిమాకు చక్కని ఆదరణ లభిస్తున్నదని నిర్మాతల్లో ఒకరైన కిశోర్ రాఠి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.