నటీనటులు: రోహిత్ బెహల్, అపర్ణాజనార్ధన్ బెనర్జీ, దశరథ్, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, డివై చౌదరి తదితరులు
కథ: థశరథ్
మాటలు: ప్రవీణ్ వర్మ,
నిర్మాతలు: డీవై చౌదరి
సంగీతం: వేద
దర్శకత్వం: డివైచౌదరి
సంతోషం, మిస్టర్ ఫర్ఫక్ట్ చిత్రాల దర్శకుడు దశరథ్ కథను అందించి డీవై చౌదరితో కలిసి నిర్మించిన చిత్రం లవ్యూ రామ్. ఈ చిత్రంలో దశరథ్ కూడా కీలకపాత్రలో కనిపించాడు. నాట్యం ఫేమ్ రోహిత్బెల్ హీరోగా నటించాడు. ప్రచార చిత్రాలతో అందరిలో ఆసక్తిని కలిగించిన ఈ లవ్‌స్టోరీ ఎలా వుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
కథ: కథానాయకుడు రామ్ (రోహిత్బెల్) నార్వేలో స్థిరపడిన భారతీయ యువకుడు. అతనిది హోటల్ బిజినెస్. మనీమైండెడ్గా, కమర్షియల్‌గా ఆలోచించే మనస్తత్వం వున్న అతనికి నార్వేలో చాలా హోటల్స్వుంటాయి. పెళ్లిసంబంధాలు చూస్తున్నప్పుడు దివ్య (అపర్ణా జనార్థన్) పరిచయం కలుగుతుంది.
కానీ చిన్నప్పటి నుండి ఒకరిని ప్రేమిస్తుంటుంది దివ్య. అయితే దివ్య రామ్‌ను తన జీవితంలో ఆహ్వానించిందా? లేదా? అతడి కమర్షియల్ మైండ్‌సెట్‌కి దివ్య సెన్సిటివిటి మధ్య లవ్ ఎలా చిగురించింది? దివ్య ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుందా లేదా ? అతనెవరు అనేది మిగతా కథ
విశ్లేషణ: ప్రేమకథలు రాయడంలో దశరథ్ది ఓ ప్రత్యేకశైలి. సున్నితమైన భావోద్వేగాలకు కమర్షియల్ అంశాలు జోడించి మంచి కథను అందించాడు దశరథ్. దశరథ్ ఆలోచనలను తెరపైకి తీసుకరావడంలో దర్శకుడిగా డీవై చౌదరి మంచి ప్రతిభను కనబరిచాడు. అక్కడక్కడా తడబడినా దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కథలో మలుపులు ఊహించడం కష్టం కాకపోయినా తరువాత ఏం జరుగుతుందో ఈజీగా చెప్పవచ్చు. అయినా వినోదంతో ప్రేక్షకులను థియేటర్లో కూర్చొబెట్టేలా చేశాడు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దశరథ్ నటుడిగా ఎంతో అనుభవం వున్న వాడిలా చక్కగా నటించాడు. ఆయన పాత్ర ఎంటర్టైనింగ్ వుంది. సెకండాఫ్‌లో కాస్త కామెడీతో పాటు మరికొన్ని బలమైన సీన్స్ వుంటే సినిమా మరింత రక్తికట్టేది. సంగీతం కథలో లీనమైలా చేసింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. టోటల్‌గా ఇట్స్ టైమ్‌పాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
బలాలు: కథ, కామెడీ, ఎమోషన్స్ సీన్స్
మైనస్: రన్‌టైమ్
రేటింగ్: 2.5/5