Lokesh Kanagaraj | దక్షిణాది ఇండస్ట్రీలో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు లొకేష్ కనకరాజ్. ఇటీవలే ‘లియో’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన..తదుపరి ప్రాజెక్ట్‌ను సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు లోకేష్ కనకరాజ్. రజనీకాంత్ సినిమా కోసం ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపారు.
‘లియో’ సినిమాపై కొందరు కావాలని దుష్ప్రచారం చేశారని, అయితే అవేవీ సినిమా విజయాన్ని ఆపలేకపోయానని లోకేష్ కనకరాజ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు కావాలని ‘లియో’ చిత్రంపై తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయాలను నేను పట్టించుకోలేదు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపైనే దృష్టి పెట్టబోతున్నా. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాం’ అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.