Thalaivar 171 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇప్పటికే తలైవా 170 (Thalaivar 170) తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో తలైవా 171 (Thalaivar 171)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రజినీకాంత్. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్-రజినీకాంత్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా లోకేశ్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించి మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, నెక్ట్స్ సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పాడు. రోబో సినిమా తర్వాత తలైవా 171లో తలైవా విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నా. అంతేకాదు రజినీకాంత్ పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చేశాడు.
స్క్రిప్ట్ డిమాండ్ మేరకు తలైవా 171 చిత్రంలో రజినీలోని మరో కోణాన్ని పూర్తిగా ఆవిష్కరింబోతున్నానని, ఇది తన కెరీర్లోనే ఉత్తమ కథ అని చెప్పుకొచ్చాడు లోకేశ్ కనగరాజ్. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లియో విడుదల కావడంతో ఇక లోకేశ్ కనగరాజ్ ఫోకస్ అంతా తలైవా 171 మీద ఉండబోతుందని చెప్పకనే చెప్పేస్తున్నాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్ మరోవైపు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో లాల్‌సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2024 పొంగళ్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
I like Rajni Sir’s negative shade performances. I will try to bring it as much as I can in #Thalaivar171 💥
– Lokesh Kanagaraj pic.twitter.com/5xtDSAqwtI
— Bharathi (@Bharathistweets) October 31, 2023
Loki planning to Quit from #Thalaivar171 ( An Un Announced Project ) which is Planned to Announce after #Leo ~
First Loki told about the Sniper scene in #LokeshKanagaraj to Rajini movie – #Thalaivar171 & Without Loki’s Knowledge – Rajinikanth told that Sniper scene to Nelson,… pic.twitter.com/kyRcYuoBWn
— Roвιɴ Roвerт (@PeaceBrwVJ) September 10, 2023
లాల్‌సలామ్ షూటింగ్ పూర్తి..
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023