Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయని తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దళపతి విజయ్ (Vijay) యాక్షన్ ఎంటర్టైనర్ లియో (Leo.. Bloody Sweet)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. లియోను అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విజయ్ నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకొచ్చిన టాక్ చెబుతోంది.
అయితే లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియా నుంచి తప్పుకోబోతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. మరి దీనిక్కారణమేంటనే కదా మీ డౌటు. ప్రతీ సారి అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు చిర్రెత్తుకొచ్చే ట్రోల్స్ కూడా చేస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య యుద్దం నడుస్తోన్న సమయంలో తనపై చూపిస్తున్న ద్వేషం, ట్రోలింగ్స్‌తో కలత చెందుతున్నానన్నారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. కానీ ఇది తరచుగా జరుగుతూ అసహ్యంగా మారుతుంది.. అంతేకాదు అభిమానులు వారి పోస్ట్‌లలో నన్ను ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తారు.
నాకు రోజూ వేల సంఖ్యలో ఇలాంటి పోస్ట్‌లు వస్తుంటాయి. నేను సోషల్ మీడియా నుండి తప్పుకోవాలని ఆలోచిస్తున్నా. నాకు సోషల్ మీడియాపై ఆసక్తి లేదు. ఇది కేవలం రెండున్నర గంటల వినోదం మాత్రమే.. అభిమానులంతా తిరిగి వెళ్లి తమ పనులు చేసుకోవచ్చు. అంతేకాదని దీనిని ఓ యుద్ధంలా భావించడం సరైంది కాదు.. తన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేశ్ కనగరాజ్ కామెంట్ల నేపథ్యంలో మరి ఇకనైనా నెటిజన్లు, మూవీ లవర్స్ పనికిమాలిన ట్రోల్స్ నిలిపేస్తారా..? లేదా.. అనేది చూడాలి మరి.
ప్రేమ ఓ ఆయుధం సాంగ్..
Badass సాంగ్..
లియో ట్రైలర్..
లియో అన్‌కట్ వెర్షన్ అప్డేట్..
Out of respect for Lokesh Kanagaraj’s vision, we’re committing to NO CUTS for #LEO‘s UK release. Every frame is essential, and audiences deserve to experience it in its raw form. Once we feel the film has reached a wide audience, we’ll switch to a 12A friendly version 🙌 pic.twitter.com/TJemUXVTwr
— Ahimsa Entertainment (@ahimsafilms) September 13, 2023
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..