Lokesh Kanagaraj | కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ల జాబితాలో ఎప్పుడూ ముందుంటాడు లోకేష్ కనగరాజ్. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘కూలీ’ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా తరువాత లోకేష్ ఏ ప్రాజెక్ట్‌కి కమిట్ అవుతాడన్నది మాత్రం సందిగ్ధంగా మారిపోయింది. ఈ అనిశ్చితి ఫ్యాన్స్‌కి, ముఖ్యంగా ‘ఖైదీ’ అభిమానులకు పెద్ద టెన్షన్‌గా మారింది. ‘కూలీ’ పూర్తయ్యాక వెంటనే లోకేష్ రజినీకాంత్ – కమల్ హాసన్ కాంబోలో భారీ మల్టీస్టారర్ చేయబోతున్నాడన్న ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆ సినిమాకి లోకేష్ దర్శకుడు కాదని స్పష్టమైంది. దీంతో తమిళ ప్రేక్షకులు, ఫ్యాన్స్ తదుపరి ఆప్షన్‌గా ‘ఖైదీ 2’ ఉంటుందని అనుకున్నారు.
తాజా రూమర్స్ ప్రకారం లోకేష్ కనగరాజ్ ప్రస్తుతానికి ‘ఖైదీ 2’ ప్రారంభించే ఆలోచనలో లేడని, మరో కొత్త ప్రాజెక్ట్ వైపు మొగ్గుచూపుతున్నాడని చెబుతున్నారు. దీంతో ‘ఖైదీ’ యూనివర్స్ ఫ్యాన్స్‌లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఇలా కామెంట్ చేస్తున్నారు .“ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం, కానీ లోకేష్ మళ్లీ వేరే సినిమాకే వెళ్లిపోతున్నాడు, LCU యూనివర్స్‌ని మొదట పూర్తిచేయాలి కదా… ఖైదీ 2 ఎందుకు వాయిదా?, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను మేము ఎంత లౌడ్‌గా సపోర్ట్ చేసామో… ఇప్పుడు మా పేషెన్స్ పరీక్షించేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
లోకేష్ రూపొందించిన LCU (Lokesh Cinematic Universe)కు అపారమైన క్రేజ్ ఉంది. కైతి, విక్రమ్, లియో ఇవన్నీ కలిసి ఒక భారీ యూనివర్స్‌గా ఎదుగుతున్నాయి. ఇందులో కైతి 2 కీలకమైన భాగం. ఆ సినిమా ముందుగా రావాల్సి ఉంది. కానీ అనేక ప్రాజెక్టులు వరుసగా లోకేష్ చేతిలోకి వెళుతుండటంతో, కైతి 2 పదేపదే వాయిదా పడుతుందన్న భావన ఫ్యాన్స్‌లో అసహనాన్ని పెంచుతోంది.ప్రస్తుతం కోలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం లోకేష్ మరో స్టార్‌తో సినిమా చేయబోతున్నాడనే అన్‌ఆఫిషియల్ టాక్ ఉంది ‘ఖైదీ 2’ స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ, ప్రీ–ప్రొడక్షన్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం. ‘ఖైదీ 2’ వాయిదా నిజమైతే, ఇది LCU అభిమానులకు పెద్ద షాక్ అని అభిప్రాయం. మొత్తం మీద, లోకేష్ కనగరాజ్ లైనప్ రూమర్స్, ‘ఖైదీ 2’ వాయిదా వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.