Lokesh Kanagaraj Coolie | తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్ర నటులైన నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, షౌబిన్ షబీర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న లోకేష్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి స్పందించాడు.
‘కూలీ’ చిత్రాన్ని చూసిన తర్వాత రజనీకాంత్ సార్ తనతో కలిసి మరో సినిమా చేయాలని కోరారని లోకేష్ కనగరాజ్ తెలిపారు. అయితే, ఈ కొత్త ప్రాజెక్ట్ ‘కూలీ 2’ కాదని లోకేష్ స్పష్టం చేశారు. “కూలీ సినిమాకు సరైన ప్రారంభం మరియు ముగింపు ఉన్నాయి కాబట్టి, అది ‘కూలీ 2’ అయ్యే అవకాశం లేదు” అని ఆయన పేర్కొన్నారు. దీనిబట్టి, రజనీకాంత్, లోకేష్ కాంబినేషన్లో రాబోయే తదుపరి చిత్రం పూర్తిగా కొత్త కథాంశంతో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఖైదీ 2 తర్వాత ఉంటుందని లోకేష్ వెల్లడించాడు.