కెప్టెన్సీ కంటెండర్ రెండో టాస్క్ కోసం సిరి, రవి పోటీ పడ్డారు. ఈ టాస్క్ ప్రకారం పూల్‌లో ఉన్న బాటిల్స్‌ని గాలం ద్వారా తీసి ఒడ్డున పెట్టాలని చెప్పారు. ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డున పెడతారో వాళ్లే విజేతలు అవుతారని బిగ్ బాస్ చెప్పారు. ఇద్దరు చాలా కసిగా గేమ్ ఆడారు. సిరి కూర్చుంటూ, పడుకుంటూ ,కింద మీద పడుతూ గేమ్ ఆడింది . ఎట్టకేలకు బజర్ మోగే లోపు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది.
దీంతో సిరికి కూడా బిగ్ బాస్ హౌజ్ లో ప్రవేశించే ఛాన్స్ దక్కింది. మొదటి టాస్క్‌లో షణ్ముఖ్ విజయం సాధించి హౌజ్‌లో ఉండగా, రెండో టాస్క్‌లో విజయం సాధించిన సిరి కూడా లోపలకి వెళ్లి అతడితో చిల్ అయింది. స్ట్రాంగ్ టీ తాగుకుంటూ ఇద్దరు చిల్ అయ్యారు. ఇక మూడో పోటీదారులుగా శ్రీరామ్, మానస్లు పోటీపడ్డారు. రోప్ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువ సేపు రోప్ చేస్తూ ఉంటారో వారే విజేత అవుతారని బిగ్ బాస్ తెలిపారు.
టాస్క్‌లో శ్రీరామ్, మానస్ బాగానే కష్టపడ్డారు. చివరి వరకు నిలిచిన శ్రీరామ్ విజేతగా నిలిచాడు.ఇక మరో రెండు టాస్క్‌లు మిగిలి ఉండగా.. ఆ రచ్చ నేడు కంటిన్యూ కానుంది.అయితే ఇంటి సభ్యులంతా ఒకే చోట కూర్చుని ఉండగా.. లోబో వాళ్ల మధ్యలోకి వెళ్లి పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి బాంబ్‌లు వదిలాడు. ఆ దెబ్బతో కాజల్ బాత్ రూంలోకి పరుగులు పెట్టింది. మిగిలిన వాళ్లంతా ముక్కులు మూసుకుని ఛీ ఛీ అనుకున్నారు. షణ్ముఖ్ అయితే రూం స్ప్రే తీసుకుని వెళ్లి అతని వెనక కొట్టాడు. ముందు బయటకు వెళ్లు అంటూ కేకలు పెట్టారు.