Little Hearts | చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ మౌళి తనుజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి మార్తండ్ దర్శకత్వం వహించగా.. ఆదిత్య హాసన్ నిర్మించారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, సత్య కృష్ణన్ వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్హిట్ను అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి (Little Hearts OTT) రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీనిచ్చింది. ఈ సినిమా త్వరలోనే ఈటీవీ విన్లో రాబోతుందని వస్తున్న వార్తలను చిత్రబృందం ఖండిచింది. ‘ఇలా నకిలీ ప్రచార ఫొటోలను వ్యాప్తి చేస్తే, మీ ఫోను మీద ఒట్టే’ అంటూ హెచ్చరించింది. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది.
“We are excited to announce #littlehearts OTT release date….”
Don’t expect this 😂😂
We are still running housefull in theatres🥳🥳Ela fake images spread chesthe mi phone mida otte😂 pic.twitter.com/lnSlwuB9Fo
— ETV Win (@etvwin) September 19, 2025