Pushpa 2 The Rule – Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప ది రూల్’ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 6 రోజుల్లో రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం రూ.1500 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా సాధించిన విజయం పట్ల తాజాగా ముంబైలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ వేడుకకు అల్లు అర్జున్‌తో పాటు చిత్రబృందం హాజరయ్యింది.
అయితే ఈ వేడుకలో యాంకర్ పుష్పరాజ్‌ని అడుగుతూ.. ఇండియాలో 38 కోట్ల మంది భర్తలు ఉన్నారు. అందరి ఇళ్లలో వారి భార్యలతో గొడవలు జరుగుతుంటాయి. కానీ మీరు మాత్రం భార్య(శ్రీవల్లి) సీఎంతో ఫొటో అడిగిందని ముఖ్యమంత్రినే మార్చేశారు. ఒక ఫోటో కోసం సీఎంని మార్చారని… ఇండియాలో ఉన్న 38 కోట్ల మంది భర్తలు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు… వారికీ ఏం చెప్తారు ? అంటూ యాంకర్ అడుగుతాడు. దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. భర్తలు అందరూ భార్య చెప్పేది వినండి అంటూ చెప్పుకోచ్చాడు.