సుధా అర్జున్, అంబికా వాణి జంటగా రూపొందుతున్న చిత్రం ‘లింగడు’. ‘ద పవర్ ఆఫ్ సాల్వేషన్’ ఉపశీర్షిక. కె.ఎస్.రవీంద్రనాయక్ దర్శకుడు. పెండ్లి ప్రభాకర్ నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నిజానికి దగ్గరగా, మాస్‌కి నచ్చేలా సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌అర్జున్, కెమెరా: సతీశ్‌కుమార్.