Kisi ka Bhai Kisi ki Jaan Movie | మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో అంచనాలున్నాయి. సల్మాన్ అభిమానులు కోరుకునే ప్రతీ అంశం ఈ సినిమాలో ఉన్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టమైంది. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా ఫర్హాద్ పుష్కలంగా దట్టించాడు. ఇప్పటికే బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. బాలీవుడ్ విశ్లేషకులు అంచనాలను బట్టి ఈ సినిమా సల్మాన్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా అవడంలో సందేహమే లేదని తెలుస్తుంది. పైగా పాటలు కూడా కావాల్సినంత బజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇక చిత్రబృందం కూడా గత రెండు వారాలుగా వరుస ప్రమోషన్లు, అప్డేట్లతో ఎక్కడలేని హైప్‌ను తెచ్చిపెట్టాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘లెట్స్ డ్యాన్స్ చోటు మోటు’ అంటూ సాగే హూషారెత్తించే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో పట్టు పంచెలు, లంగా ఓణీలను ధరించి దక్షిణాది సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ స్వర పరుచగా హనీసింగ్ రాప్‌ను ఆలపించాడు. తెలుగు బిట్‌ను దేవి ఆలపించాడు. ఇక ఈ పాటలో హనీసింగ్ కూడా పంచెకట్టులో దర్శనమిచ్చాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగులో పవన్ ఇదే సినిమాను ‘కాటమరాయుడి’గా రీమేక్ చేశాడు.