Leo Movie | అందరికంటే ముందుగా దసరా స్లాట్‌ను బుక్ చేసుకుని.. అదే దిశగా పరుగులు పెడుతుంది లియో సినిమా. రిలీజ్‌కింకా నెల రోజులకు పైగా ఉన్నా.. చిత్రబృందం చక చక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ఒక్క పాట సాంబార్ బ్యాచ్‌కు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. ఇక రీసెంట్గా రిలీజైన సంజయ్ దత్, అర్జున్ గ్లింప్స్‌లు వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. బిజినెస్ లెక్కలు సైతం రెండొందల కోట్ల పై చీలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి.
పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట.మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తులో జరపాలని చూస్తున్నారట. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది.
ఇక ఈ సినిమాపై వీర లెవల్లో బిజినెస్ జరగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారట.
#LeoTeluguPoster at 6PM, Today! 🔥 #Leo #LeoPosterFeast https://t.co/0rsYsfsDKH
— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2023