Leo Movie | అందరికంటే ముందుగా దసరా స్లాట్‌ను బుక్ చేసుకుని.. అదే దిశగా పరుగులు పెడుతుంది లియో సినిమా. రిలీజ్‌కింకా రెండు నెలలకు పైగా ఉన్నా.. చిత్రబృందం చక చక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ఒక్క పాట సాంబార్ బ్యాచ్‌కు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. ఇక రీసెంట్గా రిలీజైన సంజయ్ గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. బిజినెస్ లెక్కలు సైతం రెండొందల కోట్ల పై చీలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త తమిళ మీడియాలో మార్మోగిపోతుంది. ఈ సినిమాకు లోకేష్.. ఓపెన్ ఎండింగ్‌ను ప్లాన్ చేశాడట. అంటే విక్రమ్, ఖైదీ సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్లుగానే లియో సినిమాకు కూడా పార్ట్-2ను ప్లాన్ చేస్తున్నారట. ముందు నుంచి ఈ విషయాన్ని గుట్టుగా దాచాలనుకున్నా.. వాళ్ల నోటా వీళ్ల నోటా పాకీ తమిళనాట తెగ వైరల్ అవుతుంది. ఇక ఏ క్షణమైనా సీక్వెల్ గురించి చెప్పే అవకాశాలున్నాయని చెన్నై టాక్. ఇక ఈ సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తున్న అర్జున్ సర్జా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాపై వీర లెవల్లో బిజినెస్ జరగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారట.