Leo | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు నా రెడీ సాంగ్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే విడుదల తేదీ వరకు మూవీ నుంచి కొత్త పోస్టర్లు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇందులో భాగంగానే వినాయక చవితి కానుకగా లియో నుంచి తెలుగు, కన్నడ పోస్టర్లను విడుదల చేసింది. తర్వాత గత బుధవారం లియో కొత్త పోస్టర్ (Leo New Poster) విడుదల చేసింది. ఇందులో విజయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. “కామ్ గా ఉండండి.. యుద్ధానికి సిద్ధం కండి(Keep Calm and Prepare for the Battle)” అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ లియో మూవీపై ఆసక్తిని మరింత పెంచేసింది. అనంతరం ఈ సినిమా నుంచి దళపతి విజయ్, సంజయ్ దత్‌లు ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ”కామ్ గా ఉండండి డెవిల్ను ఎదుర్కోండి”(Keep Calm and Face The Devil) అనే డైలాగ్‌తో ఈ పోస్టర్ ఉండగా.. ఇందులో సంజయ్ గొంతును విజయ్ పట్టుకోవడం చూడొచ్చు. తాజాగా మరో కొత్త పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్లో బ్లడీ స్వీట్ (Bloody Sweet) అని ఉండగా విజయ్ హామర్ (సుత్తి) పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
New #LEO Wall paper.. 🔥 https://t.co/t8A8E2v9Ns pic.twitter.com/cfnZN0QRgR
— Ramesh Bala (@rameshlaus) September 26, 2023
ఇక లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ఆంటోనీ దాస్ గ్లింప్స్ కూడా ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది.