తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా కథాంశం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం హీరో విజయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్ సీరియస్ లుక్‌లో శక్తివంతంగా కనిపిస్తున్నారు.
ఈ ఫస్ట్‌లుక్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరో యాక్షన్ ప్యాక్డ్ రోల్లో విజయ్ కనిపించబోతున్నారని చెబుతున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ గత చిత్రాల తరహాలోనే డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. త్రిష కథానాయిక నటిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్నది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.