Lokesh kanagaraj | లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా LCUలో భాగంగా సినిమా తెరకెక్కున్నట్లు వార్తలు రావడంతో లియోపై ఎక్కడలేని హైప్ పెరిగింది. దానికి తోడు విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ సైతం మిలియన్లలో వ్యూస్‌ను సాధించి.. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను లోకేష్ వెల్లడించాడు. లోకేష్ సోషల్ మీడియాలో రెడీ ఆ! అంటూ ఓ ట్వీట్ చేశాడు. దాంతో లియో సినిమా టీజర్‌కు సంబంధించిన అప్డేట్ అయ్యుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ కమల్ హాసన్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.లలిత్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Ready ah?
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023