Legend Saravanan | లేటు వయస్సులో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ బాక్సాఫీస్‌ను షేక్ చేద్దామనుకున్నాడు. కానీ తన ఫన్నీ గెటప్, యాక్టింగ్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచి.. ట్రోల్స్ బారిన పడ్డాడు శరవణన్ ఆరుళ్ (లెజెండ్ శరవణన్). ఐదు పదుల వయస్సులో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హోం బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై ది లెజెండ్ సినిమా చేశాడు. 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోవడమే కాదు.. శరవణన్ (Legend Saravanan)ను అంతా ట్రోల్స్‌తో ముంచెత్తారు.
ఆ తర్వాత రెండేళ్లుగా ఎలాంటి సినిమా ప్రకటన చేయలేదు. ఈ బిజినెస్మెన్ కమ్ యాక్టర్యాక్టర్గా రాణించడం కష్టమేనని నెట్టింట చర్చ జరుగుతున్న సమయంలో కొన్ని రోజుల క్రితం కొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్‌లో ఆరెంజ్ కలర్ సూట్లో స్టైలిష్‌గా కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిస్తూ నెట్టింట ఫొటోలు రిలీజ్ చేసి హల్ చల్ చేశాడు. అయితే తాజాగా ట్రోల్స్ చేస్తే ఏంటీ..? డోన్ట్ కేర్ అంటూ రెండో సినిమాను లైన్లో పెట్టాడు.
గరుడన్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దురై సెంథిల్ కుమార్ (Durai Senthilkumar)తో రెండో సినిమాను ప్రకటించాడు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. శరవణన్ ఈ సారి కొంచెం గడ్డం పెంచి కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించబోతున్నట్టు తాజా స్టిల్స్‌తో అర్థమవుతోంది. మరి శరవణన్ నటుడిగా తనను తాను నిరూపించేందుకు ఈ సారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
రెండో సినిమా లాంచ్..
#LegendsNext #NewGameStarted@Dir_dsk@onlynikil pic.twitter.com/nIvJxNDUkl
— Legend Saravanan (@yoursthelegend) June 24, 2024
లెజెండ్ శరవణన్ లుక్..
New Transition…
Details Soon…#Legend #TheLegend #LegendSaravanan #NewEraStarts pic.twitter.com/PilzbEHQut— Legend Saravanan (@yoursthelegend) March 13, 2023